కౌశల్ కి కాల్ చేయలేదనడంలో నిజం లేదు: గీతామాధురి

  • కౌశల్ కి నేను కంగ్రాట్స్ చెప్పాను 
  • భాను ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు 
  • తను ఫోన్ చేయవచ్చు గదా  
'బిగ్ బాస్ 2'లో కౌశల్ విజేతగా నిలవగా .. రెండవ స్థానంలో గీతామాధురి నిలిచింది. తాజాగా 'ఎన్టీవి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతామాధురి మాట్లాడింది. బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటికి వచ్చిన తరువాత ఎవరూ తనకి కాల్ చేయలేదని .. అభినందించలేదని కౌశల్ అనడం గురించిన ప్రస్తావన వచ్చింది.

అందుకు గీతామాధురి స్పందిస్తూ .. "ఆ రోజునే స్టేజ్ పైనే నేను కౌశల్ కి కంగ్రాట్స్ చెప్పాను. ఇక హౌస్ లో నుంచి బయటికి వచ్చిన తరువాత కౌశల్ కి కాల్ చేయలేదనే మాటలోను వాస్తవం లేదు. ఎవరో నాకు ఫోన్ చేసి ఆయన నెంబర్ అడిగారు. కౌశల్ ను అడిగి ఇద్దామని ఆయనకి కాల్ చేశాను. కనెక్ట్ కాకపోవడంతో 'హాయ్ కౌశల్ గారూ ఎలా వున్నారు? అని పలకరిస్తూ .. విషయాన్ని వాయిస్ మెసేజ్ పెట్టాను. ఆ వాయిస్ మెసేజ్ కి నీలిమా కౌశల్ గారు ఆన్సర్ చేశారు. 'బిగ్ బాస్ 2' కంటెస్టెంట్ భాను తన బర్త్ డేకి పిలుద్దామని ఫోన్ చేసినా కౌశల్ లిఫ్ట్ చేయలేదు. మేమే కాల్ చేయాలని ఏముంది? తాను చేయవచ్చు కదా?" అని సమాధానమిచ్చింది.
Go Back to Shorts
geeta madhuri

More Telugu News