స్టాక్ మార్కెట్ అంతే... 45 నిమిషాల్లో రెండు లక్షల కోట్ల లాభం!
- గురువారం నాడు మార్కెట్ కు భారీ నష్టం
- ఈ ఉదయం వెల్లువెత్తిన కొనుగోళ్లు
- 600 పాయింట్లకు పైగా లాభం
ఈ ఉదయం 10.10 గంటల సమయంలో బొంబాయి స్టాక్ మార్కెట్ సూచిక సెన్సెక్స్, క్రితం ముగింపుతో పోలిస్తే 628 పాయింట్లు పెరిగి 34,629 పాయింట్లకు చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, 177 పాయింట్లు పెరిగి 10,411 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల ఈక్విటీలు లాభాల్లో ఉండగా, టెక్, ఐటీ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, హింద్ పెట్రో, బజాజ్ ఫిన్ సర్వ్, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాల్లోనూ, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో తదితర సంస్థలు నష్టాల్లోనూ నడుస్తున్నాయి.