'సైరా' నుంచి విజయ్ సేతుపతి .. సుదీప్ ఫస్టులుక్స్
- భారీ బడ్జెట్ చిత్రంగా 'సైరా'
- ప్రత్యేకమైన ఆకర్షణగా రత్నవేలు ఫోటోగ్రఫీ
- ప్రధానమైన బలంగా అమిత్ త్రివేది సంగీతం
అందువలన ఆయా భాషల నుంచి అమితాబ్ .. విజయ్ సేతుపతి .. సుదీప్ లను కూడా కీలకమైన పాత్రల కోసం తీసుకున్నారు. ఇప్పటికే అమితాబ్ పాత్రకి సంబంధించిన లుక్ బయటికి వచ్చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి .. సుదీప్ ల ఫస్టులుక్ లను వదిలారు. విభిన్నమైన వేషధారణతో ఇద్దరూ కూడా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమా ఈ ఇద్దరి కెరియర్లోను ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అమిత్ త్రివేది సంగీతం .. రత్నవేలు ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తాయని అంటున్నారు.