‘యంగ్ టైగర్’ కళ్లల్లోని ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను: యాంకర్ గాయత్రి భార్గవి
- హరికృష్ణ పెన్సిల్ స్కెచ్ ను మా తాతయ్య గీశారు
- ఈ స్కెచ్ ను తారక్ కు అందజేశా
- యంగ్ టైగర్ ఆనందం అంతాఇంతా కాదు
ఈ సందర్భంగా తారక్ కు ఆమె ఓ అపురూపమైన కానుకను అందజేశారు. ఆమె తాత శంకర్ నారాయణ గీసిన నందమూరి హరికృష్ణ పెన్సిల్ స్కెచ్ ను జూనియర్ కు అందజేశారు. ఈ విషయాన్ని గాయత్రి భార్గవి తన ట్వీట్ ద్వారా తెలిపింది. తన తాతయ్య శంకర్ నారాయణ గీసిన నందమూరి హరికృష్ణ పెన్సిల్ స్కెచ్ ను తారక్ కు ఇచ్చానని, దీనిని అందుకున్న యంగ్ టైగర్ కళ్లల్లో ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పింది. ఈ పెన్సిల్ స్కెచ్ ను అందుకున్న యంగ్ టైగర్.. ‘అమ్మకు ఇస్తానండి.. థ్యాంక్యూ’ అని చెప్పాడని గాయత్రి భార్గవి పేర్కొంది.