టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్‌ను అడ్డుకున్న సొంత పార్టీ కార్యకర్తలు
- నాలుగున్నరేళ్లలో రాకుండా ఇప్పుడెందుకు వచ్చారు?
- ప్రచారానికి వస్తున్నట్టు సమాచారం ఇవ్వరా?
- ప్రచార రథాన్ని ముందుకు వెళ్లనివ్వని ప్రజలు
ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న కొందరు తెరాస కార్యకర్తలు సైతం రేఖానాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఊరికి ప్రచారానికి వస్తున్నట్టు సమాచారం ఇవ్వరా? అంటూ ఆమెపై మండిపడ్డారు. దీంతో అసహనానికి గురైన రేఖానాయక్ తెరాస పార్టీ ఎవరికీ భయపడదంటూ.. తెరాస ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ప్రచార రథాన్ని ముందుకు పోకుండా ప్రజలు అడ్డుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది.