మిషన్ భగీరథ తవ్వకాల్లో బయటపడ్డ వెండి నాణేలు
- మంచిర్యాల జిల్లాలో బయటపడ్డ నాణేలు
- నాణేలను స్వాధీనం చేసుకున్న అధికారులు
- పురావస్తు శాఖకు అప్పగిస్తామని వెల్లడి
అయితే మేడి రాజం అనే వ్యక్తికి ఈ విషయం తెలియడంతో ఆ కూలీ ఉన్న గుడారానికి వెళ్లి... ఈ నాణేలు తన భూమిలో దొరికాయంటూ వాటిని లాక్కున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో దేవాపూర్ ఎస్సై దేవయ్య, తహసీల్దార్ ప్రసాద్ వర్మలు పంచనామా నిర్వహించి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని నిజాం కాలం నాటివిగా గుర్తించారు. పురావస్తు శాఖకు వీటిని అప్పగిస్తామని చెప్పారు.