డిప్రెషన్‌ను తగ్గించే వ్యాయామం
మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ (ఎండీడీ)తో బాధపడుతున్న వారికి నిర్దిష్టంగా వ్యాయామాలను ఎలా సూచించాలో మార్గదర్శనం చేయడానికి ఇప్పుడు పరిశోధనలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి అమెరికాలో జరిగిన పరిశోధనల్లో ఓ భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం.
మనుషుల్లో డిప్రెషన్‌ను తొలగించడానికి ఏ విధంగా వ్యాయామాలను ప్రిస్క్రయిబ్ చేయాలనే విషయంలో ఇదివరలో ఎలాంటి నిర్దిష్ట మార్గదర్శకాలు లేవు. అయితే వ్యాయామం యాంటీ డిప్రెసెంట్‌గా ఉపయోగపడుతుందని గుర్తించినట్లు పరిశోధనలో పాల్గొన్న చాడ్ రితోర్స్ట్, మధుకర్ త్రివేది చెబుతున్నారు. వీరు డల్లాస్ లోని యూనివిర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్ వెస్టర్న్ మెడికల్ సెంటర్ లో సైకియాట్రీ విభాగంలో పనిచేస్తున్నారు.
వ్యాయామం అనేది ఎండీడీతో బాధపడుతున్న రోగుల్లో డిప్రెషన్ తగ్గించడానికి ఎంతో ఉపకరిస్తుందని వీరు గుర్తించారు. సైకోతెరపీ, యాంటీ డిప్రెసంట్ మందుల వాడకంతో పాటూ వ్యాయామం కూడా జత చేస్తే ఫలితం మెరుగ్గా ఉంటుందని తేలింది.