ఆమ్ ఆద్మీ నేత కారులో వెళుతుంటే... సజీవ దహనం చేసిన ప్రత్యర్థులు!

  • యూపీలోని బోప్రా సమీపంలో ఘటన
  • కారుకు లాక్ వేసి నిప్పంటించినట్టు అనుమానం
  • ప్రత్యర్థుల పనేనన్న నవీన్ దాస్ కుటుంబ సభ్యులు
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, యూపీకి చెందిన నవీన్ దాస్ (25)ను ప్రత్యర్థులు సజీవదహనం చేశారు. బోప్రా ప్రాంతంలోని సహీదాబాద్ రోడ్డులో ఆయన తన కారులో ప్రయాణిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. ఆయన్ను ఓ పథకం ప్రకారం కారులో ఎక్కించి, బయటి నుంచి లాక్ చేసి నిప్పంటించి వుంటారని తెలుస్తోంది.

రోడ్డుపై ఓ కారు నుంచి మంటలు వస్తుండటాన్ని గమనించిన కొందరు ప్రజలు, పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చేలోపే లోపలున్న వ్యక్తి మృతిచెందాడు. కారు నంబర్ ఆధారంగా, అతన్ని నవీన్ దాస్ గా గుర్తించారు. తన సోదరుడు రాజకీయంగా ఎదుగుతూ ఉండటంతో ఓర్చుకోలేని ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడ్డారని సవీన్ సోదరి ఆరోపించారు. కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. నవీన్ కుటుంబాన్ని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు.
Go Back to Shorts
Navin Das
Car
AAP
Died
Murder

More Telugu News