విడాకులు తీసుకున్న భార్యను రేప్ చేసిన మాజీ భర్త... పదేళ్ల జైలు!
- 2015లో వివాహం చేసుకున్న జంట
- ఆపై మనస్పర్థలతో 2016లో విడాకులు
- కేసును విచారించి తీర్పిచ్చిన జబల్ పూర్ కోర్టు
గత సంవత్సరం జూలై 25న తన మాజీ భార్య ఇంటికి వచ్చిన అతను, ఆమెపై అత్యాచారం చేశాడు. విడాకులు ఇచ్చిన తరువాత, తన మాజీ భర్త రేప్ చేశాడంటూ, ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది. ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి ఆర్పీ సోనీ, నిందితుడికి పదేళ్ల జైలు శిక్షను విధిస్తున్నానని, రూ. 5 వేల జరిమానాను ఆమెకు చెల్లించాలని తీర్పిచ్చారు.