తెలంగాణలో తగ్గనున్న టీఆర్ఎస్ బలం... పుంజుకోనున్న కాంగ్రెస్!
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు 9 స్థానాలు
- 2 నుంచి 6 సీట్లకు పెరగనున్న కాంగ్రెస్ బలం
- బీజేపీ, ఎంఐఎంలకు చెరొకటి
2014 ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ బలం 11 ఎంపీ సీట్ల నుంచి 2 స్థానాలు తగ్గుతాయని తెలిపింది. బీజేపీ తనకున్న ఒక్క సీటునూ నిలుపుకుంటుందని, టీడీపీ తాను పొందిన ఒక్క స్థానాన్నీ కోల్పోతుందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ 2014లో 2 సీట్లను మాత్రమే గెలిచినప్పటికీ, ఈ దఫా మహాకూటమి కారణంగా లాభపడి 6 సీట్ల వరకూ గెలుస్తుందని అంచనా వేసింది.