అరాచకాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోం!: టీఆర్ఎస్‌ కు డీకే అరుణ వార్నింగ్

  • రాజకీయాల ముసుగులో రౌడీల్లా ప్రవర్తిస్తే ఖబడ్దార్
  • కేసీఆర్-మోదీ ఒప్పందంలో భాగమే ముందస్తు ఎన్నికలు
  • పాలించడం చేతకాక మధ్యలోనే కాడిపడేసిన కేసీఆర్
రాజకీయాల ముసుగులో రౌడీల్లా ప్రవర్తిస్తే.. ‘నా కొడకల్లారా, ఖబడ్దార్’ అని కాంగ్రెస్ నేత టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ కో-చైర్‌పర్సన్‌ డీకే అరుణ టీఆర్ఎస్ నాయకులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గురువారం గద్వాలలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆమె టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అరాచకాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ఎన్నికలకు ముందు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే పాలించడం చేతకాక మధ్యలోనే కాడిపడేసిన కేసీఆర్, ఇప్పుడు మరోమారు ప్రజలను మోసగించాలని చూస్తున్నారన్నారు. మోదీ-కేసీఆర్ ఒప్పందంలో భాగంగానే ముందస్తు ఎన్నికలు వచ్చాయని అరుణ ఆరోపించారు.
Go Back to Shorts
Telangana
KCR
DK Aruna
Gadwal
Congress

More Telugu News