మారుతీరావును మిర్యాలగూడకు తీసుకొచ్చిన పోలీసులు.. సోదాలు!

  • డీఎస్పీ ఆధ్వర్యంలో ఇళ్లలో సోదాలు
  • పలు కీలక ఆధారాలు స్వాధీనం
  • సోదాల అనంతరం జిల్లా కేంద్రానికి తరలింపు
మిర్యాలగూడలో చోటుచేసుకున్న ప్రణయ్ పరువుహత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణ కోసం కోర్టు అనుమతితో నిందితులను కస్టడీకి తీసుకున్నారు. ఈనెల 5వ తేదీ వరకు వీరిని విచారించనున్నారు. ఈ నేపథ్యంలో కేసులో ప్రధాన నిందితులైన మారుతీ రావు (అమృత తండ్రి), అతని సోదరుడు శ్రవణ్ కుమార్ లను పోలీస్ బందోబస్తు మధ్య మిర్యాలగూడకు తీసుకొచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇరువురి ఇళ్ల తాళాలు తెరిపించి, సోదాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆధారాలతో పాటు, కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సోదాలు ముగిసిన అనంతరం ఇద్దరినీ తిరిగి జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. 
Go Back to Shorts
pranay
maruthi rao
amrutha
muryalaguda

More Telugu News