కౌశల్... నిన్ను చూసి నేను సంతోషిస్తున్నా: మహేష్ బాబు

  • టీవీ ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్
  • విజేతగా నిలిచిన కౌశల్
  • అభినందనలు తెలిపిన మహేష్ బాబు
తెలుగు టీవీ ప్రేక్షకులను 113 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ సీజన్-2లో విజేతగా నిలిచిన కౌశల్ ను టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అభినందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "కంగ్రాచ్యులేషన్స్ కౌశల్. ఇదో గొప్ప విజయం. నిన్ను చూసి నేను చాలా సంతోషిస్తున్నా. నీ విజయాన్ని ఆస్వాదించు" అని వ్యాఖ్యానించాడు. మూడు రోజుల క్రితం జరిగిన గ్రాండ్ ఫినాలేలో గీతామాధురితో పోటీ పడ్డ కౌశల్, చివరకు విజేతగా నిలిచి, విక్టరీ వెంకటేష్ నుంచి ట్రోఫీని అందుకున్న సంగతి తెలిసిందే. బయటకు వచ్చిన తరువాత కౌశల్ స్పందిస్తూ, మహేష్ బాబు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాడు కూడా.
Go Back to Shorts
Koushal
Biggboss
Mahesh Babu
Winner
Twitter

More Telugu News