దలైలామా హత్యకు కర్ణాటకలో ఉగ్రవాదుల కుట్ర!
- కుట్ర పన్నిన ఉగ్రవాది మునీర్
- ఎన్ఐఏ అరెస్ట్ తో వెలుగులోకి
- బైలుకుప్పె సమీపంలో హత్యకు కుట్ర
దలైలామా తరచుగా మైసూరుకు దగ్గరలో ఉన్న బైలుకుప్పె ప్రాంతంలోని టిబెటన్ పునరావాస కేంద్రానికి వస్తుంటారన్న సంగతిని పసిగట్టిన మునీర్, ఆయన వచ్చిన వేళ, హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ పని చేస్తే, భారత్ తో పాటు పలు దేశాల్లో చిచ్చు పెట్టవచ్చన్నది ఆయన వ్యూహం. ఈ సంవత్సరం జనవరి 18న బిహార్ లోని బుద్ధగయలో జరిగిన ఓ కార్యక్రమంలో బాంబు పేల్చడం ద్వారా దలైలామాను, ఆయనతో పాటు ఇదే కార్యక్రమంలో పాల్గొనే బిహార్ గవర్నర్ ను హత్య చేయాలని కుట్ర చేసినట్టు కూడా మునీర్ చెప్పినట్టు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి.