వివాహమైన స్నేహితురాలిని వేధిస్తున్న విద్యావంతుడు... కటకటాల వెనక్కి పంపిన పోలీసులు!
- ఐదేళ్ల పరిచయాన్ని స్నేహంగా భావించిన యువతి
- ప్రేమనుకున్న ఎంటెక్ విద్యార్థి
- వివాహం కావడంతో బయటకొచ్చిన మరో కోణం
ఈ సంవత్సరం జూలై 1న ఆమెకు వివాహం జరుగగా, తన వికృత చేష్టలతో ఆమెను వేధించడం ప్రారంభించాడు పాషా. భర్త ఫోన్ నంబర్ ను తెలుసుకుని, గతంలో తనతో దిగిన ఫొటోలను పంపించాడు. ఆమెకు ఫోన్ చేసి ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. నువ్వు ఫ్రెండనుకున్నావేమోగానీ, నేను మాత్రం నిన్ను ప్రియురాలిగానే చూశానని హెచ్చరించాడు. దీంతో ఆమె విషయమంతా తన భర్తకు చెప్పి, ఆయన సాయంతో పోలీసులను ఆశ్రయించింది. పాషాను అరెస్ట్ చేసిన పోలీసులు, అతన్ని రిమాండ్ కు తరలించారు.