బుక్ చేసుకున్న క్యాబ్‌ను డ్రైవర్ రద్దు చేస్తే.. ఇక ఢిల్లీలో రూ.25 వేలు కట్టాల్సిందే!
- క్యాబ్ అర్థాంతరంగా రద్దు చేస్తే డ్రైవర్‌కు రూ.25 వేల జరిమానా
- ప్రయాణికుడి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పోలీసు కేసు
- ముసాయిదా సిద్ధం చేసిన ఢిల్లీ రవాణా శాఖ
ప్రయాణికుల పట్ల డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు కూడా నమోదు చేయాలని, ఒకవేళ కేసు పెట్టకుంటే డ్రైవర్ లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ ముసాయిదాను ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి సత్యేంద్ర జైన్ త్వరలోనే కేబినెట్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. అంతేకాదు, ఇకపై యాప్ ఆధారిత క్యాబ్ సేవలకు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కూడా తప్పనిసరి. అలాగే, కనిష్ఠ, గరిష్ఠ ధరలను రవాణా శాఖ నిర్ణయించేలా చట్టాన్ని కూడా తీసుకురానున్నారు.