'ఆర్ ఎక్స్ 100' దర్శకుడి నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనే!
- భారీ హిట్ కొట్టిన 'ఆర్ ఎక్స్ 100'
- మల్టీ స్టారర్ ను పక్కన పెట్టేసిన అజయ్ భూపతి
- భవ్యక్రియేషన్స్ బ్యానర్ పై మూవీ
ఆయన తదుపరి సినిమా నితిన్ తో వుండనుందనే వార్తలు వినిపించాయి. రామ్ .. దుల్కర్ సల్మాన్ హీరోలుగా మల్టీ స్టారర్ చేసే ఉద్దేశంతో ఉన్నాడనే టాక్ కూడా వినిపించింది. అయితే ప్రస్తుతానికి ఆయన ఈ మల్టీ స్టారర్ ను పక్కన పెట్టేశాడట. నితిన్ హీరోగా కథను లాక్ చేసుకుని, త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు.