విజయ్ దేవరకొండ తమ్ముడు తెరంగేట్రం... హీరోయిన్ గా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక!
- టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్
- తమ్ముడిని పరిచయం చేసేందుకు ఇదే సరైన సమయమని ఆలోచన
- అక్టోబర్ 10న ప్రారంభం కానున్న షూటింగ్
ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం కానున్న సినిమాలో హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయం కానుంది. తెలంగాణ నేపథ్యంలో కథ ఉంటుందని, అక్టోబర్ 10న షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. పలు షార్ట్ ఫిలింస్ తీసి, తానేంటో నిరూపించుకున్న కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో యష్ రంగినేని, మధుర శ్రీధర్ లు దీనికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.