రేవంత్ ఖాతాలో ఒకే రోజు రూ. 9 కోట్లు డిపాజిట్ చేసిన రఘువరన్ మురళి... ఎవరితను?
- నిన్నటి నుంచి రేవంత్ ఇళ్లలో సోదాలు
- వెలుగులోకి పలు ఆసక్తికర అంశాలు
- ఫిబ్రవరి 25, 2014న ఒక్కరోజే భారీ మొత్తంలో నగదు బదిలీ
ఇక అదే రఘువరన్ మురళి, రేవంత్ రెడ్డికి చెందిన ఆర్ హెచ్బీ బ్యాంకు ఖాతా (1300098050844099)కు 20 లక్షల సింగపూర్ డాలర్లు (సుమారు రూ. 9.53 కోట్లు) పంపించాడని, ఆ ఒక్క రోజే సుమారు రూ. 20 కోట్ల విదేశీ మారకం జరిగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ లావాదేవీల వెనుక రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి ఉన్నాడని, రేవంత్ మరో తమ్ముడు జగన్ రెడ్డికి కూడా పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఈ రఘువరన్ మురళి ఎవరన్న కోణంలో ఈడీ, ఐటీ అధికారులు రేవంత్ ను, ఆయన సోదరులను ప్రశ్నిస్తున్నారు.