రాజయ్యపై పోటీ చేస్తా.. చిత్తుచిత్తుగా ఓడిస్తా!: టీఆర్ఎస్ నేత రాజరపు ప్రతాప్
- ప్రకటించిన టీఆర్ఎస్ నేత రాజరపు ప్రతాప్
- తనను, అనుచరుల్ని తీవ్రంగా వేధించాడని మండిపాటు
- స్టేషన్ ఘన్ పూర్ లో డిపాజిట్లు దక్కవని వ్యాఖ్య
ఎవరు ఏం చేసినా రాజయ్యను స్టేషన్ ఘన్ పూర్ లో చిత్తుచిత్తుగా ఓడిస్తానని ప్రకటించారు. దాదాపు లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తానని రాజయ్య చెప్పుకుంటున్నాడనీ, కనీసం ఈసారి ఆయనకు డిపాజిట్ కూడా దక్కే అవకాశాలు లేవని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టకుండా తాను పోటీ చేస్తాననీ, దమ్ముంటే రాజయ్య కూడా అలాగే పోటీ చేయాలని ప్రతాప్ సవాలు విసిరారు. స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను టీఆర్ఎస్ అధిష్ఠానం తాటికొండ రాజయ్యకు కేటాయించిన సంగతి తెలిసిందే.