రణ్ వీర్, దీపికల వివాహం వాయిదా?
- నవంబర్ లో పెళ్లి జరగనున్నట్టు వార్తలు
- ఇంటిని కూడా సిద్ధం చేస్తున్న రణ్ వీర్
- రెండు నెలలు వాయిదా అంటున్న బాలీవుడ్
ఇటీవల కొనుగోలు చేసిన ఇంటిని రణ్ వీర్ మెరుగు పరుస్తున్నాడని, కొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నారని, పెళ్లయిన తరువాత దీపికతో కలసి ఇక్కడే ఉంటాడని కూడా వినిపించింది. పెళ్లి కోసం షూటింగ్ లు పెట్టుకోకుండా ఉన్నారని తెలుస్తున్న వేళ, పెళ్లి ముహూర్తం ఓ రెండు నెలలు వాయిదా పడ్డట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారికంగా స్పష్టత రావాలంటే, రణ్ వీర్ లేదా దీపికల్లో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.