అభిమానికి అల్లు శిరీష్ ల్యాప్ టాప్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభిమానికి అల్లు శిరీష్ ల్యాప్ టాప్

  • అన్నయ్య చాలా గిఫ్టులు ఇచ్చాడు 
  • ఇప్పుడు మరో గిఫ్ట్ చేతికొచ్చింది 
  • చాలా సంతోషంగా వుంది
కథల ఎంపిక విషయంలో అల్లు శిరీష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, ఒక సినిమా తరువాత మరో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆయనకి బన్నీ ఒక యాపిల్ మాక్ ల్యాప్ టాప్ ను గిఫ్టుగా ఇచ్చాడు. తన పట్ల అన్నకు గల ప్రేమానురాగాలకు అల్లు శిరీష్ పొంగిపోయాడు. చిన్నప్పటి నుంచి అన్నయ్య నాకు చాలా గిఫ్టులు ఇచ్చాడు. అలా యాపిల్ మాక్ ల్యాప్ టాప్ ఇచ్చిన అన్నయ్యకి ధన్యవాదాలు అంటూ స్పందించాడు.

 ఈ ట్వీట్ పై ఒక అభిమాని స్పందిస్తూ .. "అన్నా, నాకు ఒక చిన్న ల్యాప్ టాప్ ఇవ్వొచ్చు కదా .. నేను కొనాలంటే ఓ మూడేళ్లు పడుతుంది. నాకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ .. జీతం తక్కువ. నాకు ల్యాప్ టాప్ చాలా అవసరం .. కానీ ఇంతవరకూ కొనుక్కోలేకపోయాను" అంటూ రాసుకొచ్చాడు. అందుకు అల్లు శిరీష్ 'నువ్వేం బాధపడకు తమ్ముడు .. నాకు కొత్త ల్యాప్ టాప్ వచ్చింది గనుక, నా దగ్గరున్న సోనీ ల్యాప్ టాప్ నీకు ఇస్తాను .. నీ పూర్తి వివరాలు మెయిల్ చేయి' అంటూ సమాధానమిచ్చాడు. 
allu shirish

More Telugu News