హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఢీకొన్న కారు.. విరిగిపడ్డ విగ్రహం

  • హైదరాబాదులో నేతల విగ్రహాలకు కరువైన భద్రత
  • బాలానగర్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఢీకొన్న కారు
  • డ్రైవర్ ను పోలీసులకు అప్పగించిన టీడీపీ నేతలు
హైదరాబాద్, బాలానగర్ రహదారిపై ఉన్న నేతల విగ్రహాలకు రక్షణ లేకుండా పోతోంది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు విగ్రహాలను ఢీకొంటున్నాయి. ఇప్పటికే రాజీవ్ గాంధీ, పీజేఆర్, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ ల విగ్రహాలు వాహనాలు ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. తాజాగా నిన్న రాత్రి 9 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి కూకట్ పల్లి వైపు వెళ్తున్న ఓ కారు ఫిరోజ్ గూడా వద్ద రోడ్డు మధ్యలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఢీకొంది. ఈ ఘటనలో విగ్రహం విరిగి రోడ్డుపై పడింది. దీన్ని గమనించిన టీడీపీ నేతలు కారు డ్రైవర్ సందీప్ ను పట్టుకుని బాలానగర్ పోలీసులకు అప్పగించారు.
Go Back to Shorts
ntr
statue
accident
hit
car
balanagar
Hyderabad

More Telugu News