జగన్ కాపులను అమ్ముడుపోయే జాతి అనుకుంటున్నారు.. అవసరమైతే సొంత పార్టీ పెట్టుకుంటాం!: ముద్రగడ
- కాపు కార్పొరేషన్ పేరుతో జగన్ కబుర్లు
- మాజీ మంత్రి చింతా మోహన్ తో భేటీ
- కాపు నేతలతో చర్చించి రాజకీయ కార్యాచరణపై నిర్ణయం
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాపులకు ఎవరు న్యాయం చేస్తారో వారితో కలిసే ముందుకు వెళతామని ముద్రగడ తెలిపారు. కాపు జాతి రిజర్వేషన్ కోసం పోరాడే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తమకెవరూ న్యాయం చేయకుంటే సొంతంగా పార్టీ పెట్టేందుకు వెనుకాడబోమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని కాపు నేతలతో చర్చించి రాజకీయ భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.