ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ వద్దు.. తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు!
- నాగరాజు కేసులో తీర్పును సమర్ధించిన ధర్మాసనం
- కొత్తగా రిజర్వేషన్ అమలు అవసరం లేదని వ్యాఖ్య
- పాత తీర్పును సమీక్షించబోమని వెల్లడి
ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్ ఫలాలు అనుభవించేందుకు కొన్ని షరతులు విధిస్తూ.. నాగరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై 2006లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కొన్నిరోజుల క్రితం సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. నాగరాజు కేసులో ఎలాంటి సమీక్షలు చేపట్టాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.