చంద్రబాబు, నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట.. అక్రమాస్తుల పిల్ ను వెనక్కి తీసుకున్న శ్రవణ్ కుమార్!
- పిల్ దాఖలుచేసిన మాజీ లాయర్ శ్రవణ్ కుమార్
- నాలుగేళ్లలో రూ.25,000 కోట్లు దోచేశారని ఫిర్యాదు
- హైకోర్టు సూచనతో పిల్ ఉపసంహరణ
గత 4 సంవత్సరాల్లో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ రూ.25,000 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్ లో శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ అక్రమాలపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని కోరారు. ప్రతివాదులుగా చంద్రబాబు, లోకేష్ లతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, తదితరులను చేర్చారు. కంపెనీలకు 57,836 ఎకరాల భూములతో పాటు అనుమతుల జారీలో క్విడ్ ప్రో కో చేటుచేసుకుందని ఆరోపించారు.