రాయలసీమలో పిడుగులు పడచ్చు.. హెచ్చరించిన ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ!
- మూడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
- జాగ్రత్తగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ శాఖ
- అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచన
అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ, వజ్రకరూర్, గుంతకల్, కడప జిల్లాలోని లింగాల, కర్నూలు జిల్లాలోని హాల్వహర్వి, చిప్పగిరి మండలాలు, పరిసర ప్రాంతాల్లో రాబోయే 24 గంటల్లో పిడుగులు పడతాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, ఆకాశం మేఘావృతమైన సందర్భాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.