Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకప్పుడు నాగార్జున సినిమా టికెట్ల కోసం కొట్లాడాను: హీరో నాని

  • నా అభిమాన హీరో నాగార్జున 
  • ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను 
  • ఈ అవకాశం రావడం నా అదృష్టం
నాగార్జున .. నాని కాంబినేషన్లో రూపొందిన 'దేవదాస్' .. ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం జరిగిన 'దేవదాస్' ప్రెస్ మీట్లో నాని మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నేను నాగార్జున గారి అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన సినిమా టికెట్ల కోసం థియేటర్లోని కౌంటర్ల దగ్గర కొట్లాడిన సందర్భాలు కూడా వున్నాయి.

అలాంటి నా అభిమాన హీరోతో కలిసి నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా నటనను ఆయన అభినందించడం గర్వంగా అనిపించింది. ఆయనతో కలిసి నటించినప్పటి క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి. ఒక వైపున 'దేవదాస్' షూటింగుతో .. మరో వైపున 'బిగ్ బాస్ 2' షూటింగుతో బాగా మానసిక ఒత్తిడికి గురయ్యాను. అందువలన మానసిక ప్రశాంతత కోసం కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లి రావాలనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.   
nagarjuna
nani

More Telugu News