మనసు పడిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పలేకపోయిన 'దేవదాస్' డాన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మనసు పడిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పలేకపోయిన 'దేవదాస్' డాన్!

  • నా హీరోయిన్ న్యూస్ రీడర్ 
  • ఆమె కనిపించిందంటే కంగారే 
  • మల్టీ స్టారర్ లోను రిస్క్ ఎక్కువే      
నాగార్జున .. నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన 'దేవదాస్' ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి నాగార్జున మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను 'దేవ్' అనే పాత్రలో కనిపిస్తాను. కాలేజ్ రోజుల్లోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాను. ఆమె న్యూస్ రీడర్ గా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆమెను ఆరాధిస్తూ వున్నా ఎప్పుడూ కలుసుకుని ఆ విషయాన్ని మాత్రం చెప్పలేకపోతాను. అందుకు కారణం ఆమె కనిపిస్తే కంగారు పుట్టడమే. ఎంతటి వారికైనా భయపడని నేను .. ఆమెను కలుసుకోవడానికి మాత్రం ఇబ్బంది పడిపోతుంటాను. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ దాస్ .. మమ్మల్ని కలుపుతాడు. ఇలా చాలా వినోదభరితంగా ఈ సినిమా రూపొందింది. నానితో కలిసి మల్టీ స్టారర్ చేయడం ఆనందంగా వుంది. మల్టీ స్టారర్ లో రిస్క్ తక్కువ అంటే నేను ఒప్పుకోను .. ఇద్దరు హీరోలు కలిసి కూడా హిట్ కొట్టలేకపోయారు అనే మాట రాకుండా చూసుకోవాలి" అని చెప్పుకొచ్చారు.    
nagarjuna
nani

More Telugu News