తాత గెటప్ లో సుమంత్ నటించిన తొలి సీన్ ఇదే!
నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఎన్టీ రామారావు బయోపిక్ 'ఎన్టీఆర్'లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను పోషిస్తున్న సుమంత్, తన తొలిరోజు షూటింగ్ విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు.
ఇప్పటికే విడుదలైన సుమంత్ లుక్, ఈ సినిమాపై అంచనాలను పెంచగా, తొలిరోజున ఎన్టీఆర్ ప్రమాణ స్వీకార సమయానికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించినట్టు చెప్పారు. తాను, చంద్రబాబునాయుడి పాత్రధారి రానా కలిసి నటించామని చెప్పాడు. తొలిరోజు షూటింగ్ కు తాతయ్య వాడిన ఆఖరి కారులో వెళ్లానని, ఆయన్ను తెరమీద ఆవిష్కరిస్తున్నానన్న భావన మదినిండా నిలిచిందని చెప్పారు. ఓ బాధ్యతగా ఈ పాత్రను చేస్తున్నానని అన్నాడు.