రాఫెల్ డీల్‌పై స్పందించిన చంద్రబాబు.. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
- హోలండ్ నోరు విప్పడంతో లోగుట్టు బయటపడింది
- సైనికుల మనోభావాలను మోదీ దెబ్బ తీశారు
- జాతికి క్షమాపణ చెప్పాల్సిందే
ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. అవుకు జలాశయం నుంచి కడప జిల్లాలోని గండికోట జలాశయానికి నీటిని విడుదల చేశారు. అనంతరం కొలిమిగుండ్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాఫెల్‌పై స్పందించారు. చంద్రబాబు ఈ డీల్‌పై స్పందించడం ఇదే తొలిసారి.