రాఫెల్ అంశాన్ని వివాదాస్పదం చేయడంలో అర్థం లేదు: రాజ్‌నాథ్
- హోలాండే వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు
- స్పందించిన కేంద్ర హోం మంత్రి
- రాఫెల్‌పై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవే
దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. దీనిపై నిజానిజాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. రాఫెల్‌పై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని, ఈ అంశాన్ని వివాదస్పదం చేయడంలో అర్థం లేదని రాజ్‌నాథ్ అన్నారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని ఇప్పటికే రక్షణశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.