నకిలీ 'ప్యారడైజ్' హోటళ్లపై న్యాయస్థానం కొరడా.. వెంటనే బోర్డులు తొలగించాలని ఆదేశం!
- హైదరాబాద్ లో వందలాది నకిలీ ప్యారడైజ్ లు
- కోర్టును ఆశ్రయించిన ప్యారడైజ్ యాజమాన్యం
- నకిలీ హోటళ్ల బోర్డులను తొలగించిన అధికారులు
ఈ హోటళ్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమ పేరును చెడగొడుతున్నాయని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. ప్యారడైజ్ పేరును మిగతా హోటళ్లు వాడుకోవడం అక్రమమని తీర్పు ఇచ్చింది. వాటిని తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు, అధికారులు అక్రమంగా ప్యారడైజ్ పేరుతో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించారు. ప్యారడైజ్ పేరుతో ఉన్న కవర్లు, బాక్సులు, లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు.