అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి?: జేసీపై హోంమంత్రి చినరాజప్ప ఆగ్రహం
- పోలీసులు నాలుక కోస్తామనడం సరికాదు
- నాపై జేసీ విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా
- పిఠాపురంలో పర్యటించిన హోమంత్రి
జేసీ దివాకర్ రెడ్డి తనపై చేసిన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నానని చినరాజప్ప అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. వాళ్లు సక్రమంగా పనిచేశారు కాబట్టే చిన్నపొలమడలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని అన్నారు. నాలుకలు కోస్తామంటూ పోలీసులు అనడం కూడా సరికాదని, అధికారులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.