మరోసారి బయటపడిన పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి: భారత్
- జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం
- ఆ దేశ ప్రధాని అసలు రూపం బయటపడిందని వ్యాఖ్య
- విదేశాంగ మంత్రుల భేటీ రద్దు
పాకిస్థాన్ తీరును నిరసిస్తూ ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, షా మొహమూద్ ఖురేషీ మధ్య జరగాల్సిన భేటీని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. ‘చర్చల ప్రతిపాదన వెనుక పాకిస్థాన్ దుష్టపన్నాగం బయటపడింది. ఆ దేశం వైఖరిలో ఎటువంటి మార్పులేదని ప్రపంచానికి వెల్లడైంది. ఈ వాతావరణంలో చర్చలు జరపడం అర్థరహితం’ అని భారత్ విదేశీ వ్యవహారా శాఖ ప్రతినిధి రవీష్‌కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్ కు చెందిన ముగ్గురు పోలీసులను అపహరించి దారుణంగా చంపడంతో సరిహద్దులో మళ్లీ వాతావరణం వేడెక్కింది.