'ఓఎల్ఎక్స్' వేదికగా మోసాలు.. సంస్థ చైర్మన్ కు విశాఖ సైబర్ పోలీసుల నోటీసులు!
- ఓఎల్ఎక్స్ వేదికగా పెరుగుతున్న మోసాలు
- సగటున రోజుకు రెండు ఫిర్యాదులు
- విశాఖకు రానున్న ఓఎల్ఎక్స్ చైర్మన్
సగటున రోజుకు ఈ తరహా కేసుల్లో రెండు ఫిర్యాదులు వస్తుండటంతో, వెబ్ సైట్ నిర్వాహకులను పిలిచి మాట్లాడాలని భావించిన, సైబర్ క్రైమ్ ఉన్నతాధికారులు, ఇటీవల ఢిల్లీ వెళ్లి విశాఖలో జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ, ఓఎల్ఎక్స్ చైర్మన్ కు నోటీసులు ఇచ్చారు. ఆయన నేడు లేదా రేపు విశాఖకు వచ్చి, పోలీసుల విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం.