Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబునాయుడు ‘తెలంగాణ’ వ్యతిరేకి: టీఆర్ఎస్ ఎంపీ వినోద్

  • ‘కాళేశ్వరం’ అనుమతులు రద్దు చేయమన్న బాబు!
  • ‘తెలంగాణ’పై ఆయనకు ప్రేమ లేదు
  • అలాంటి వ్యక్తితో తమకు ఎలాంటి సంబంధాలు ఉండవు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన ఆయనకు ఉన్నట్టయితే ఆ విధంగా ప్రవర్తించాలని అన్నారు.

 ఎన్డీఏతో టీడీపీ కలసి ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్ట్ కు అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం తెచ్చుకుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులను తమ ప్రభుత్వం తెచ్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తాము తెచ్చుకున్న అనుమతులను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబునాయుడు, అదేవిధంగా, ఏపీలోని మరికొందరు అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయాన్ని కూడా వినోద్ ప్రస్తావించారు. అంటే, చంద్రబాబునాయుడు ‘తెలంగాణ’కు వ్యతిరేకమని, తమ రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి కాదని విమర్శించారు. కనుక, అలాంటి వ్యక్తితో తమకు ఎలాంటి సంబంధాలు ఉండవని వినోద్ స్పష్టం చేశారు.
Chandrababu
TRS
vinod

More Telugu News