పాతబస్తీలో ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీకాంత్ దుర్మరణం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాతబస్తీలో ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీకాంత్ దుర్మరణం!

  • ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి
  • చనిపోయే ముందు సెల్ఫీ వీడియో
  • భార్య కుటుంబ సభ్యులే తన ఆత్మహత్యకు కారణమని వాంగ్మూలం
భార్యను దూరం చేశారన్న ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. ఏడు నెలల గర్భవతిగా ఉన్న తన భార్య శ్రీహర్షకు బలవంతంగా అబార్షన్ చేయించడం, తన కుటుంబ సభ్యులపై శ్రీహర్ష తండ్రి షణ్ముగచారి  అక్రమ కేసులు పెట్టడంతో మనస్తాపానికి లోనైన శ్రీకాంత్ నిన్న రాత్రి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ నేపథ్యంలో 90 శాతం గాయాలు అయిన శ్రీకాంత్ ఈ రోజు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తాను చనిపోయే ముందు తన చావుకు శ్రీహర్ష కుటుంబ సభ్యులే కారణమని శ్రీకాంత్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు.

పాతబస్తీలోని బాబా నగర్ కు చెందిన శ్రీకాంత్ నకిరేకల్ కు చెందిన శ్రీహర్ష అనే యువతిని నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న అమ్మాయి తండ్రి షణ్ముగచారి ఆమెను ఇటీవల బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం సదరు యువతిని బెదిరించి శ్రీకాంత్ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టించాడు. దీనికి తోడు ఏడు నెలల గర్భవతైన శ్రీహర్షకు ఆమె తండ్రి అబార్షన్ చేయించినట్లు తేలింది.
Hyderabad
suicide

More Telugu News