నిరుపేదకు రూ. 57 లక్షలు తెచ్చిపెట్టిన చిన్న ఫొటో!
- విధులు నిర్వహిస్తూ మరణించిన పారిశుద్ధ్య కార్మికుడు
- అతని మృతదేహం వద్ద రోదించిన కుమారుడు
- ఫొటో చూసి స్పందించిన వందలాది మంది ఆర్థికసాయం
ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు 31 వేల మంది దీన్ని షేర్ చేసుకున్నారు. దీంతో ఓ క్రౌడ్ ఫండ్ వెబ్ సైట్ లో స్వచ్ఛంద సంస్థ ఒకటి, అతని కుటుంబాన్ని ఆదుకుందామని పిలుపునిచ్చి నిధుల సేకరణ ప్రారంభించింది. వందలాది మంది స్పందించారు. ఫలితంగా కేవలం రెండు రోజుల వ్యవధిలో రూ. 57 లక్షలు పోగయ్యాయి. అనిల్ కు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఈ మొత్తాన్ని అనిల్ కుటుంబానికి అందిస్తామని స్వచ్ఛంద సంస్థ తెలిపింది.