మరో రెండు రోజులు గడిస్తే గానీ చెప్పలేం... మాధవి హెల్త్ బులెటిన్ విడుదల!
- 3 సర్జరీలు జరిగాయన్న యశోదా డాక్టర్లు
- ఆరు యూనిట్ల రక్తం ఎక్కించామని వెల్లడి
- చికిత్సకు మాధవి స్పందిస్తోందన్న వైద్యులు
మాధవి ఆరోగ్యంపై మరో రెండు రోజులు గడిస్తే గాని ఏమీ చెప్పలేమని యశోదా ఆసుపత్రి వైద్యులు బులెటిన్ లో తెలిపారు. యువతి శరీరంలో ముందుగానే హిమోగ్లోబిన్ తక్కువగా ఉందనీ, తాజాగా ప్రమాదం నేపథ్యంలో మాధవికి 6 యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం మాధవిని వెంటిలేటర్ పై ఉంచామని పేర్కొన్నారు. తమ సూచనలకు మాధవి స్పందిస్తోందని వైద్యులు తెలిపారు.