రక్షిత్ తో పెళ్లి రద్దుపై తొలిసారిగా స్పందించిన హీరోయిన్ రష్మిక!
- రక్షిత్ తో నిశ్చితార్థం తరువాత వరుస హిట్లు
- ఆపై రక్షిత్ తో నిశ్చితార్థం రద్దు చేసుకున్న రష్మిక
- తనను ప్రశాంతంగా ఉండనివ్వాలని వేడుకోలు
బయట తనను ఎలా చూస్తున్నారన్న విషయాన్ని తలచుకుంటేనే బాధగా ఉంటోందని, దీనికి తాను ఎవరినీ నిందించదలచుకోలేదని చెప్పింది. బయటి వ్యక్తులు నమ్ముతున్నది నిజం కాదని చెప్పేందుకు తన తరఫున ఎవరూ రాలేదని వాపోయింది. ప్రతి నాణానికీ బొమ్మ, బొరుసు ఉన్నట్టే, ప్రతి కథకూ రెండు కారణాలుంటాయని, తనను ప్రశాంతంగా ఉండనివ్వాలని వేడుకుంది. తాను భాషాభేదాలు లేకుండా రెండు భాషల్లో నటనను కొనసాగిస్తానని చెప్పింది.