పెట్రోలు ధరలపై బీజేపీ అధ్యక్షురాలిని ప్రశ్నించిన ఆటో డ్రైవర్.. ఈడ్చుకెళ్లి చావబాదిన బీజేపీ నేత!
- పెట్రో ధరలపై ప్రశ్నించిన ఆటో డ్రైవర్
- ఈడ్చి పడేసి చెంపలు వాయించిన బీజేపీ నేతలు
- వైరల్ అవుతున్న వీడియో
బాధితుడు కాథిర్ (49) మాట్లాడుతూ తనో ఆటో డ్రైవర్‌నని, పెట్రోలు ధరలు పెరగడంతో తన జీవనం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి తమిళసై మాట్లాడుతుండడంతో తాను కూడా ప్రశ్న అడగవచ్చని భావించి అడిగానని చెప్పుకొచ్చాడు. తానడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తనపై దాడిచేశారని, చెంపలు వాచిపోయాయని చూపించాడు. కాథిర్‌పై బీజేపీ నేతలు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.