అనుమానాస్పద స్థితిలో లాడ్జిలో మరణించిన టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్!

  • గత 20 రోజులుగా లాడ్జిలో అర్జున్ గౌడ్
  • రాత్రి పూట మాత్రలేసుకుని పడుకున్న అర్జున్
  • తెల్లారేసరికి విగతజీవుడిగా...
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
హైదరాబాద్ లోని ఓ లాడ్జిలో జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పదంగా మృతిచెందాడు. బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల మేరకు, మంగా టిఫిన్‌ సెంటర్‌ ఎదురుగా ఉన్న హృదయ లాడ్జిలో అర్జున్‌ గౌడ్‌ (30) అనే యువకుడు, గత 20 రోజులుగా రూము అద్దెకు తీసుకుని ఉంటూ, సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో అర్ధరాత్రి షూటింగ్‌ ముగించుకొని లాడ్జికి వచ్చిన అర్జున్ గౌడ్, కొన్ని టాబ్లెట్లు వేసుకొని పడుకున్నాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు నాగ కార్తీక్, వివరం అడుగగా, దగ్గుగా ఉన్నందున మాత్రలు వేసుకున్నానని చెప్పి పడుకున్నాడు. ఉదయం ఎంతకీ అతను నిద్ర లేవక పోవడంతో, 108కు సమాచారం అందించగా, పరీక్షించిన సిబ్బంది మృతి చెందినట్లు తెలిపారు. నాగకార్తీక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అర్జున్‌ గౌడ్‌ వేసుకున్న మాత్రల వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్పారు. 
Go Back to Shorts
Hyderabad
Krishnanagar
Banjarahills
Manga Tifin Centre
Artist

More Telugu News