ప్రపంచంలోనే తొలి హైడ్రోజన్ రైలు.. జర్మనీలో పట్టాలెక్కిన పర్యావరణ హిత రైలు!
- తయారు చేసిన ఫ్రాన్స్ సంస్థ
- ఒకసారి ఇంధనం నింపితే వెయ్యి కిలోమీటర్ల పరుగులు
- జీరో కాలుష్యం
హైడ్రోజన్ రైళ్లలో ఉపయోగించే ఇంధనం వల్ల కాలుష్య ఉద్గారాలు ఉత్పత్తి కావు. అందుకనే ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. హైడ్రోజన్, ఆక్సిజన్లను కలపడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే వ్యవస్థ ఇందులో ఉంటుంది. అవసరానికి మించి విద్యుత్తు కనుక ఉత్పత్తి అయితే, అది నేరుగా రైలులో ఏర్పాటు చేసిన లిథియం బ్యాటరీల్లోకి చేరి నిల్వ ఉంటుంది.
తొలి రైలును జర్మనీ సోమవారం పట్టాలపైకి తెచ్చింది. కక్సావెన్, బ్రెమెరావెన్, బ్రెమెర్వోర్డ్, బక్సెహుడ్ నగరాల మధ్య 1000 కిలోమీటర్ల మార్గంలో రెండు హైడ్రోజన్ రైళ్లు సేవలు అందించనున్నాయి.