ఒక్కటవుతున్న మూడు బ్యాంకులు.. ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న జైట్లీ!
- విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్ ల విలీనం
- ప్రకటన చేసిన ఆర్థిక శాఖ కార్యదర్శి
- ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న అరుణ్ జైట్లీ
ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, బ్యాంకుల విలీనం కేంద్ర ప్రభుత్వ అజెండాలో ఉందనే విషయం బడ్జెట్ లోనే తాను ప్రకటించానని తెలిపారు. తొలి అడుగును ఇప్పుడు ప్రకటించామని... త్వరలోనే విధివిధాలను ప్రకటిస్తామని చెప్పారు. ఈ విలీనంతో మూడు బ్యాంకులకు చెందిన ఉద్యోగులెవరికీ ఇబ్బందులు ఉండవని... ఉత్తమ సర్వీసు నిబంధనలను అందరికీ అమలు చేస్తామని తెలిపారు.