ఆత్మహత్యా యత్నం.. ఆపై హల్‌చల్‌!: సిబ్బందిని హడలెత్తించిన హెడ్‌కానిస్టేబుల్‌

17-09-2018 Mon 11:14 | Andhra
  • రోల్‌కాల్‌ సమయంలో ఛాతిపై రెండు రౌండ్ల కాల్పులు 
  • ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా వాహనం దూకి పరుగులు
  • తూర్పుగోదావరి జిల్లా కూనవరం పోలీస్‌స్టేషన్‌లో ఘటన
ఆర్థిక ఇబ్బందులో, కుటుంబ పరమైన సమస్యలో... స్పష్టమైన కారణం తెలియకున్నా ఓ హెడ్‌కానిస్టేబుల్‌ ఆదివారం హడలగొట్టించాడు. సిబ్బందిని పరుగులు పెట్టించాడు. ఆత్మహత్యా యత్నం చేయడమే కాక తనను బతికించవద్దంటూ పది నిమిషాల పాటు హల్‌చల్‌ చేశాడు. సిబ్బంది అతన్ని ఎలాగోలా పట్టుకుని ఆస్పత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

కాకినాడకు చెందిన కె.శ్రీనివాస్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రోల్‌కాల్‌ సమయంలో ఛాతిపై రెండు రౌండ్లు కాల్పులు జరుపుకొన్నాడు. ఈ హఠాత్పరిణామంతో దిగ్భ్రమకు గురైన సిబ్బంది తక్షణం అతన్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా పాల్వంచ వద్ద వాహనం నుంచి దూకి పరుగందుకున్నాడు. తనను బతికించే ప్రయత్నం చేయొద్దంటూ అటూ ఇటూ తిరుగుతూ పది నిమిషాల పాటు సిబ్బందికి చుక్కలు చూపించాడు. ఎట్టకేలకు సిబ్బంది అతన్ని పట్టుకుని ఆస్పత్రికి తరలించారు.
kunavaramEast Godavari DistrictAndhra Pradesh

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more