మా బాబాయ్ కొడుకు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: అమృత

  • బాబాయ్ కి వివాహేతర సంబంధాలు ఉన్నాయి
  • బాబాయ్ కొడుకు నాతో పాటు, బంధువుల అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు
  • వాడిని బాబాయ్, పిన్ని వెనకేసుకొచ్చారు
కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కసితో ఆమె భర్త ప్రణయ్ ను మారుతీరావు దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడకు చెందిన ఈ ఘటనకు సంబంధించి అమృత తండ్రి, బాబాయ్ లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి, బాబాయ్ ల గురించి అమృత సంచలన విషయాలను వెల్లడించింది.

తన తండ్రి మాదిరే బాబాయ్ కూడా నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అని చెప్పింది. బాబాయ్ కి వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని... ఆయన కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆ విషయాన్ని బాబాయ్ కి చెబితే... అబ్బాయిలు అలాగే ఉంటారు, నీవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడని వెల్లడించింది. ఈ ఘటన జరిగినప్పుడు తాను బీటెక్ చదువుతున్నానని, బాబాయ్ కొడుకు 8వ తరగతి చదువుతున్నాడని చెప్పింది.

బాబాయ్ కొడుకు పోర్న్ వీడియోలు చూస్తున్నాడని అతని తల్లికి చెబితే... వాటిని చూడకపోతే అబ్బాయి అని ఎలా అనిపించుకుంటాడు? అంటూ వెనకేసుకొచ్చిందని అమృత తెలిపింది. ఒక తల్లి ఇలాంటి వాటిని వెనకేసుకు రావడం సమంజసమేనా? అని ప్రశ్నించింది. తనతో పాటు తమ బంధువులలో ఉన్న చాలా మంది అమ్మాయిలతో బాబాయ్ కొడుకు ఇలాగే ప్రవర్తించాడని చెప్పింది. 
Go Back to Shorts
amrutha
pranay
murder
miryalaguda

More Telugu News