కొత్త బిజినెస్ ను ప్రారంభించనున్న తమన్నా

  • వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించనున్న మిల్కీ బ్యూటీ
  • 'తమన్నా డైమండ్ జువెలరీ' పేరుతో సొంత బ్రాండ్
  • ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న కరీనా, కత్రినా
సక్సెస్ ఫుల్ గా సినీ కెరీర్ ను కొనసాగిస్తోన్న తమన్నా... త్వరలోనే కొత్త బిజినెస్ ను ప్రారంభించబోతోంది. సినిమాల ద్వారా తాను సంపాదించిన మొత్తాన్ని ఈ బిజినెస్ లో పెట్టబోతోంది. తన పేరుతోనే వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించనుంది.

'తమన్నా డైమండ్ జువెలరీ' బ్రాండ్ పేరుతో ఈ బిజినెస్ చేయబోతోంది. ఈ క్రమంలో, డైమండ్ బిజినెస్ లో అడుగుపెట్టిన తొలి దక్షిణాది హీరోయిన్ గా తమన్నా రికార్డ్ సృష్టించబోతోంది. బాలీవుడ్ లో ఇప్పటికే కరీనాకపూర్, కత్రినాకైఫ్ లాంటి నటీమణులు వజ్రాల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. అయితే, సొంత బ్రాండ్ లపై వారు వ్యాపారాలు చేయడం లేదు. 
Go Back to Shorts
Tamannaah
diamond
business
tollywood

More Telugu News