ప్రియుడి ప్రపోజల్ కు ఓకే అన్న యువతి.. ఉద్యోగం నుంచి పీకేసిన కంపెనీ!
- చైనాలో విచిత్ర ఘటన
- విమానంలో ప్రపోజ్ చేసిన యువకుడు
- ఉద్యోగినిని తొలగించిన విమాన కంపెనీ
చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ లో ఓ యువతి ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె విధులు నిర్వహిస్తున్న విమానంలోకే ఎక్కిన ప్రియుడు.. టేకాఫ్ అయిన అరగంట తర్వాత లేచి ప్రపోజ్ చేశాడు. దీంతో షాక్ కు గురైన యువతి, ఆ తర్వాత పెళ్లి ప్రతిపాదనకు అంగీకరించింది. దీన్ని విమానంలో ఉన్న కొందరు ప్రయాణికులు రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఈ వీడియో చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ కంపెనీ దృష్టికి రావడంతో ఆ సంస్థ యాజమాన్యం ఉద్యోగినిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రయాణికులకు సేవలు అందించకుండా వ్యక్తిగత పనులపై దృష్టి పెట్టడంతోనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు స్థానిక మీడియా తెలిపింది.