అలా అడగటానికి నీకు సిగ్గులేదా?: విలేకరిపై మోహన్ లాల్ ఆగ్రహం!
- వెల్లింగ్టన్ ను సందర్శించిన మోహన్ లాల్
- క్రైస్తవ నన్ పై అత్యాచారాన్ని ప్రస్తావించిన మీడియా
- ఆగ్రహంతో క్లాస్ పీకిన మలయాళ సూపర్ స్టార్
"ఇటువంటి సమయంలో అనవసరపు ప్రశ్నలు అడుగుతున్నారు. సిగ్గుగా లేదా? ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి, రేప్ ఘటనకు సంబంధం ఏంటి? వరదల గురించి, ప్రకృతి విపత్తు గురించి ప్రశ్నలు అడగవచ్చు కదా? నేను మంచి విషయాలపై మాట్లాడుతున్న వేళ, మీరు అత్యాచారాలను ప్రస్తావించడం ఏంటి? నేను వచ్చిన పనికి, క్రైస్తవ సన్యాసినులకు సంబంధం ఏమైనా ఉందా?" అంటూ మోహన్ లాల్ విరుచుకుపడ్డారు. ఆ తరువాత విలేకరుల సమావేశంలో పాల్గొనకుండానే మోహన్ లాల్ వెళ్లిపోవడం గమనార్హం.